: ఖమ్మం ప్రమాద స్థలాన్ని సందర్శించిన వైఎస్ జగన్!... ఆసుపత్రిలో క్షతగాత్రులకు పరామర్శ!
తెలంగాణలోని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయికన్ గూడెం వద్ద నేటి తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వేగంగా స్పందించారు. ప్రమాదంపై సమాచారం తెలిసిన వెంటనే వివరాలు సేకరించిన ఆయన కాసేపటి క్రితం నేరుగా ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించిన ఆయన ఆ తర్వాత ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఇదిలా ఉంటే... ఈ ప్రమాదంలో ఘటన జరిగిన వెంటనే పది మంది చనిపోగా, బస్సు శిథిలాల కింద చిక్కుకుపోయిన మరో మృతదేహం కాసేపటి క్రితం బయటపడింది. దీంతో ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 11కు చేరింది.