: శ్రీవారి సేవలో సంగీత దర్శకుడు కోటి, సినీనటి నమిత
తిరుమల తిరుపతిలో ఈరోజు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఈరోజు ఉదయం తిరుమల వేంకటేశ్వరుడిని పలువురు సినీ ప్రముఖులు వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రముఖ సంగీతదర్శకుడు కోటి, సినీనటి నమిత ఆపద మొక్కుల వాడిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారుల చేతుల మీదుగా వారు తీర్థప్రసాదాలు స్వీకరించారు. దేవస్థానం వద్ద కోటి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు.