: గర్ల్ ఫ్రెండ్ తో వెళుతూ కారు ప్రమాదానికి గురైన 'టైటానిక్' హీరో


ఆస్కార్ అవార్డు విజేత, 'టైటానిక్' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో లియోనార్డో డికాప్రియో ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వీకెండ్ ట్రిప్ లో భాగంగా తన కొత్త స్నేహితురాలు నైనా అద్గాల్ తో కలసి న్యూయార్క్ దగ్గర్లోని ఈస్ట్ హాంప్టన్ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ జంట ప్రయాణిస్తున్న కారును ఓ మినీ కూపర్ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాద సమయంలో కారు నెమ్మదిగా నడుస్తుండటంతో, కారులోని వారికి గాయాలేవీ కాలేదని మీడియా వెల్లడించింది. ప్రమాదం జరిగిన నిమిషాలకే అంబులెన్స్ ఆ ప్రాంతానికి చేరుకుందని, వెనుక సీట్లో కూర్చున్న డికాప్రియో, అద్గాల్ లు ముందు సీట్లకు బలంగా తగిలారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News