: జపాన్ ను వణికిస్తున్న 'మిందుల్లే'... 387 విమానాలు రద్దు


గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న పెనుగాలులను వెంటబెట్టుకు వచ్చిన 'మిందుల్లే' (పసిఫిక్ మహా సముద్రంలో 20న ఏర్పడిన అల్పపీడనం పెను తుపానుగా మారగా దానికి ఈ పేరు పెట్టారు) ఇప్పుడు జపాన్ రాజధాని టోక్యోను వణికిస్తోంది. తుపాను ప్రభావం హెనెడా పట్టణంపై అధికంగా ఉండటంతో, ఇక్కడి నుంచి రాకపోకలు సాగించాల్సిన 387 విమానాలను రద్దు చేశారు. ఉత్తర తొహోకు రీజియన్ పై దీని ప్రభావం అధికంగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని జపాన్ మెట్రోలాజికల్ ఏజన్సీ వెల్లడించింది. ప్రస్తుతం తీరం వైపు 25 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుపాను మరికొన్ని గంటల్లో తీరాన్ని తాకవచ్చని తెలిపింది. కాగా, ఇప్పటికే మిందుల్లే ఓ జపాన్ దీవిపై పెను ప్రభావాన్ని చూపింది. దాదాపు 2,600 మత్స్యకారుల కుటుంబాలు నివసించే దీవి నాశనం అయినట్టు తెలుస్తోంది. లోతట్టు ప్రాంతాలను వరద చుట్టుముట్టవచ్చని అధికారులు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News