: ప్రధాని మోదీని క‌లిసిన జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమ‌ర్అబ్దుల్లా


హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ అనంతరం కశ్మీర్‌లో ఏర్ప‌డిన ఉద్రిక్త ప‌రిస్థితులు ఇంకా చ‌ల్లార‌ని నేప‌థ్యంలో జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా నేతృత్వంలోని విపక్ష నేతల బృందం ఈరోజు ప్రధాని మోదీతో సమావేశమైంది. క‌శ్మీర్‌లో తీవ్రస్థాయిలో అల్లర్లు చెలరేగడంతో పెల్లెట్ గన్ల వాడకం పెరిగింది. ఆ తుపాకీల వినియోగంపై వెంటనే నిషేధం విధించాలని మోదీని వారు కోరారు. దీనికి సంబంధించిన ఓ వినతిపత్రాన్ని వారు ప్ర‌ధానికి అందించారు. కశ్మీర్‌లోని ప‌రిస్థితుల‌పై స‌మ‌గ్రంగా వివ‌రించిన వారు.. రాష్ట్ర ప‌రిస్థితుల‌పై చర్చలు ప్రారంభించాలని కోరారు. దీనిపై ఆల‌స్యంకూడ‌ద‌ని విన్న‌వించుకున్నారు. ఆలస్యమైతే స‌మ‌స్య మరింత తీవ్ర‌త‌ర‌మవుతుంద‌ని ఆందోళ‌న వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News