: దెయ్యం అటకాయించిందంటూ వీడియో పోస్ట్ చేసిన తమిళ నటుడు... వైరల్ అవుతున్న వీడియోను మీరూ చూడండి!


నిజమైన దెయ్యం ఎదురుపడితే... ఆ ప్రశ్నే ఒళ్లు జలదరించేలా చేస్తుంది. తమిళ నటుడు 'వెన్నిల కబాడి కుళు' మూవీ ఫేమ్ సూరి, రాత్రిపూట ప్రయాణిస్తున్న వేళ, అతని కారుకు ఓ నిజమైన దెయ్యం ఎదురుపడిందట. ఆయన ఆ దెయ్యాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. పళని నుంచి కోయంబత్తూరు వెళుతున్న వేళ, అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఎర్రగా నిప్పులు విరజిమ్ముతున్నట్టున్న ఓ ఆకృతి రోడ్డు మధ్య నిలబడినట్టు ఈ వీడియోలో కనిపిస్తోంది. సూరి ప్రయాణిస్తున్న కారు ఆ ఆకారానికి అతిదగ్గరగా వచ్చింది. ఆపై కారు హెడ్ లైట్లు ఆర్పివేయగా, ఆ ఆకారం కనిపించకుండా పోయింది. సూరి పోస్ట్ చేసిన వీడియోను మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News