: 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజితో రానున్న శాంసంగ్ సరికొత్త ఫోన్


మరో అత్యాధునిక స్మార్ట్ ఫోన్ ను శాంసంగ్ విడుదల చేయనుంది. గెలాక్సీ సిరీస్ లో భాగంగా 'నోట్ 7' తాజా వేరియంట్ ను రేపు భారత మార్కెట్ కు పరిచయం చేయనుంది. ఇందుకు సంబంధించి భారీ ఈవెంట్ ను న్యూఢిల్లీలో శాంసంగ్ నిర్వహిస్తూ, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి మీడియాను, డీలర్లనూ ఆహ్వానించింది. ఈ శాంసంగ్ గెలాక్సీ నోట్ 7లో 6 జీబీ ర్యామ్, 128 గిగాబైట్ల అంతర్గత స్టోరేజ్ ఉంటాయని తెలుస్తోంది. 5.7 అంగుళాల డిస్ ప్లే, 1.6 గిగాహెర్జ్ ప్రాసెసర్ ఉంటాయని సమాచారం. ఇక ఇదే ఫోన్ ను చైనాలో 26వ తేదీన విడుదల చేసేందుకు శాంసంగ్ ఏర్పాట్లు చేస్తోంది.

  • Loading...

More Telugu News