: ఆట పూర్తి కాకుండానే సంబరాలు... జడ్జీల నిర్ణయంతో పతకం పోయిందని ఏడుపులు!


ఒలింపిక్స్ పోటీల చివరి రోజున 65 కిలోల రెజ్లింగ్ ఫ్రీ స్టయిల్ విభాగంలో అనుకోని పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంగోలియాకు చెందిన గాంజోరిజిన్, ఉజ్బెకిస్థాన్ కు చెందిన ఇక్తియోర్ తో తలపడగా, బౌట్ ముగియకుండానే గాంజోరిజిన్ సంబరాల్లోకి దిగాడు. ఇంకా బౌట్ మిగిలుండగానే, తానే గెలిచినట్టు భావించిన గాంజోరిజిన్ కు అతని కోచ్ లు కూడా జతకలిశారు. సమయం కాకుండానే సంబరాల్లోకి దిగినందుకు పెనాల్టీలు వేసి ఇక్తియోర్ గెలిచినట్టు ప్రకటించగా, జడ్జీల నిర్ణయాన్ని విమర్శిస్తూ, మైదానంలోనే వీరంతా బట్టలు విప్పేశారు. గాంజోరిజిన్ గట్టిగా విలపించాడు. మోకాళ్లపై కూర్చుని మరో అవకాశం ఇవ్వాలని మొత్తుకున్నాడు. అయినా న్యాయనిర్ణేతలు పట్టించుకోలేదు. దీంతో విజేతను ప్రకటించే సమయంలో గాంజోరిజిన్ పక్కన కూడా నిలబడలేదు. కాగా, క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించినందుకు ఈ మంగోలియన్ పై నిషేధం విధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News