: పోలీసులు వస్తున్నారని తెలిసి పారిపోయిన నయీమ్ అనుచరుడు
పోలీసులు వస్తున్నారనే సమాచారంతో హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఉంటున్న నయీమ్ అనుచరుడు సామ సంజీవరెడ్డి పారిపోయాడు. నయీమ్ దందాల్లో సంజీవరెడ్డి కీలక పోత్ర పోషించినట్లు సమాచారం. దీంతో, సిట్ అధికారులు సంజీవరెడ్డి కుటుంబసభ్యులను ప్రశ్నించారు. తుక్కుగూడలో నయీమ్ అనుచరులు భూములను ఆక్రమించి సంజీవరెడ్డి పేరుతో ఫంక్షన్ హాలు నిర్మించారని బాధితులు ఫిర్యాదు చేశారు. ఆదిభట్లలో భూములను కూడా బలవంతంగా లాక్కున్నారని బాధితులు ఆరోపించారు.