: ఫీల్డింగ్ చేసేటప్పుడు లక్ష్మణ్ తో రాహుల్ ద్రవిడ్ ముచ్చట్లు పెట్టుకునేవాడట!
టెస్టు మ్యాచ్ లలో ఫీల్డింగ్ చేసే సమయంలో తాను, వీవీఎస్ లక్ష్మణ్ ముచ్చట్లు పెట్టుకునేవాళ్లమని మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. నాటి టెస్టు క్రికెట్ లో వారు ఫీల్డింగ్ చేసినప్పటి విషయాలను ద్రవిడ్ గుర్తు చేసుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ద్రవిడే వెల్లడించాడు. టెస్టు మ్యాచ్ లలో బౌలర్ విసిరే బంతికి.. బంతికి మధ్య ఎక్కువ సమయం ఉంటుందని, దీంతో, తన పక్కనే ఫీల్డింగ్ చేసే లక్ష్మణ్ తో మాట్లాడుతుండేవాడినని చెప్పాడు. ఈ సందర్భంగా తనకు గుర్తు ఉన్న ఒక సందర్భాన్ని ప్రస్తావించాడు. తన కొత్త ఇంటి గురించి మాట్లాడుతూ ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్ రాలేదంటూ లక్ష్మణ్ వద్ద తన అసంతృప్తి వ్యక్తం చేశానని ద్రావిడ్ పేర్కొన్నాడు.