: సింధు, సాక్షిలకు దుబాయ్ లోని ఎన్నారై వ్యాపారి భారీ బహుమతి
రియో ఒలింపిక్ పతకాలు సాధించి భారత పేరును నిలిపిన క్రీడాకారిణిలు పీవీ సింధు, సాక్షి మాలిక్ లకు దుబాయ్ కేంద్రంగా వ్యాపారం చేస్తున్న కేరళ వాసి ముక్కత్తు సెబాస్టియన్ భారీ నజరానా ప్రకటించారు. గత 40 ఏళ్లుగా యూఏఈలో స్థిరపడ్డ సెబాస్టియన్, సింధుకు రూ. 50 లక్షలు, సాక్షికి రూ. 25 లక్షలు ప్రోత్సాహకంగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. వారిని చూసి తాను గర్వపడ్డానని, అందుకే నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నానని, త్వరలోనే కోచిలో ఓ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి వారిని ఘనంగా సత్కరిస్తానని చెప్పారు. కాగా, సెబాస్టియన్ దుబాయ్ లో ముక్కదాన్ ప్లాంటేషన్ ను, బెంగళూరులో వాహన రెంటల్స్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు.