: బీహార్ లో బయటపడ్డ పెట్రోలు బావి... స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం
బీహార్ లోని ఓ పాడుబడిన బావి నుంచి పెట్రోలు లభిస్తోందని తెలుసుకున్న చుట్టు పక్కల గ్రామాల వాసులు బిందెలు, బకెట్లు వేసుకుని క్యూ కట్టగా విషయం తెలుసుకున్న పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. గయ ప్రాంతంలోని ఓ మారుమూల గ్రామంలో వాడకుండా పాడుబడిన ఓ బావిలో నీరుందేమోనని బకెట్ వేసిన గ్రామస్తులకు నీటి స్థానంలో నిప్పు తగిలితే మండుతున్న ఇంధనం వచ్చింది. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా పాకుతూ గంటల్లో ఊరు దాటగా, ట్యాంకర్లు వేసుకుని మరీ వచ్చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న నితీశ్ సర్కారు, బావిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించడంతో, స్థానిక పోలీసులు ప్రజలను నియంత్రించి, బావికి కాపలా పెట్టారు. దీనిలో ఏముందో తెలుసుకునేందుకు నిపుణుల బృందం రానుందని స్థానిక పోలీసులు తెలిపారు.