: మియాపూర్ లో బీభత్సం సృష్టించిన కారు... జాడ కనుగొనేందుకు పోలీసుల వేట


హైదరాబాద్ మియాపూర్ సమీపంలో ఈ ఉదయం బీభత్సం సృష్టించిన కారు కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు. బీహెచ్ఈఎల్ వైపు నుంచి వేగంగా వస్తున్న కారు మియాపూర్ చౌరస్తాలో అదుపు తప్పి ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొని, ఆపై బస్టాపులోకి దూసుకెళ్లి, ఆపై ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో టూ వీలర్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, బస్టాపులో నిలుచున్న ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ల ఆధారంగా కారు ఆనవాళ్లు గుర్తించే పనిలో ఉన్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News