: శంకరాచార్యులకు, పీర్ల పండగకు ముడిపెట్టిన కాంగ్రెస్: కేసీఆర్ ఎద్దేవా


తెలంగాణ నీటి పారుదల రంగంపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన వేళ, కాంగ్రెస్ పార్టీ నేతలు శంకరాచార్యులకు, పీర్ల పండగకు ముడి పెట్టారని విమర్శించారు. వారిచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లలో మన్నో, మశానమో ఉంటే తాను స్పందించే వాడినని, అందులో ఏమీ లేకపోతే తానేమి స్పందించాలని అడిగారు. ఆల్మట్టి, నారాయణపూర్ లో నీరు వాడుతుంటే రాజోలిబండకు నీళ్లు రావడం లేదని చెబుతూ, తాము అజ్ఞానులమని కాంగ్రెస్ ఒప్పుకుందని అన్నారు. తుంగభద్ర నదిపై ఉన్న రాజోలిబండ డైవర్షన్ స్కీముకు, కృష్ణపై ఉన్న ఆల్మట్టి జలాశయానికి సంబంధమేంటని ప్రశ్నించారు. ప్రజలకు నీళ్లిచ్చే పథకాన్ని ప్రారంభించేందుకు ప్రధాని వస్తుంటే, ఆయన్ను రావద్దని లేఖ రాసిన కుసంస్కారం కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు.

  • Loading...

More Telugu News