: ఈ శాంసంగ్, ఎల్ జీ మోడల్ ఫోన్లుంటే రిలయన్స్ జియో ఉచిత డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ ఆఫర్!


దేశవ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించిన రిలయన్స్ జియో, ప్రత్యేక ప్రారంభ ఆఫర్ ను రిలయన్స్ 'లైఫ్' బ్రాండ్ స్మార్ట్ ఫోన్లతో పాటు పలు శాంసంగ్, ఎల్జీ ఫోన్ మోడల్స్ కూ విస్తరించింది. శాంసంగ్ ఫ్లాష్ షిప్ గెలాక్సీ సిరీస్ తో పాటు జే, ఏ సిరీస్ ఫోన్లకు ఈ జియో 4జీ ప్రీవ్యూ ఆఫర్ ను అందిస్తున్నట్టు ప్రకటించింది. ఎల్జీ కి చెందిన కే7 ఎల్టీఈ, స్టైలస్ 2, ఎల్జీ జీ5, ఎక్స్ స్క్రీన్, స్టైలస్ 2 ప్లస్, జీ4 స్టైలస్ 4జీ, ఎల్జీ సీ70 స్పిరిట్ ఎల్టీఈ ఫోన్లకూ ఇదే ఆఫర్ వర్తిస్తుందని సంస్థ తెలిపింది. ఈ ఫోన్ మోడల్స్ ఉన్నవారు సమీపంలోని రిలయన్స్ డిజిటల్ లేదా ఎక్స్ ప్రెస్ మినీ స్టోర్లకు వెళ్లి కొత్త జియో సిమ్ తీసుకోవచ్చని, ఆపై మూడు నెలల పాటు అపరిమిత డేటా, వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ సదుపాయాలు పొందవచ్చని పేర్కొంది. జియో ఆన్ డిమాండ్, జియో ప్లే, జియో బీట్స్, జియో మ్యాగ్స్, జియో ఎక్స్ ప్రెస్ న్యూస్ తదితర యాప్స్ ఉచితంగా వాడుకోవచ్చని వెల్లడించింది. సిమ్ యాక్టివేట్ అయిన తరువాత 90 రోజుల పాటు ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.

  • Loading...

More Telugu News