: హ్యాట్స్ ఆఫ్ టూ యూ సింధూ... నీకు గ్రేట్ ఫ్యాన్ ను అయిపోయా!: రజనీకాంత్ ట్వీట్ కు 20 వేల రీట్వీట్స్


రియో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన పీవీ సింధును సూపర్ స్టార్ రజనీకాంత్ తన ట్విట్టర్ ఖాతాలో అభినందించగా, దాన్ని 20 వేల మందికి పైగా రీట్వీట్లు చేశారు. "హ్యాట్స్ ఆఫ్ టూ యూ పీవీ సింధూ. నేను నీకు గ్రేట్ ఫ్యాన్ ను అయిపోయాను. అభినందనలు" అని రజనీ ట్వీట్ చేశారు. సాధారణంగా ట్విట్టర్ లో ఎప్పుడో తప్ప పెద్దగా వ్యాఖ్యలు చేయని రజనీకాంత్, ఈ యువ క్రీడాకారిణిని అభినందిస్తూ పెట్టిన ట్వీట్ కు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. రజనీకాంత్ తో పాటు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ సైతం ఆమెను అభినందిస్తూ ట్వీట్ చేశారు. శక్తి మేరకు ఆడి ఇండియా గర్వపడేలా చేసిందని అన్నారు.

  • Loading...

More Telugu News