: సింధు తెలుగు వారి ఘనకీర్తిని ప్రపంచానికి చాటిచెప్పింది: బాలకృష్ణ
రియో ఒలింపిక్స్ లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో పీవీ సింధు రజతపతకం సాధించడాన్ని ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రశంసించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పీవీ సింధు తెలుగు వారి ఘనకీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిందని అన్నారు. సింధును గౌరవించుకోవడం తెలుగు వారిగా, భారతీయులుగా మన కర్తవ్యమని తెలిపారు. చిన్న వయసులోనే అద్భుతమైన ప్రతిభతో ఒలింపిక్స్ లో రజతపతకం సాధించి, క్రీడల్లో భారతీయులందరికీ ఆదర్శంగా నిలిచిందని ఆయన అభినందించారు.