: సెప్టెంబర్ 8న సింధుకి 10 లక్షల రివార్డు ఇస్తా: కుమార స్వామి


సెప్టెంబర్ 8న తన కుమారుడు నటించిన సినిమా ఆడియో విడుదలకు ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ ను ఆహ్వానించానని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తెలిపారు. హైదరాబాదులో పవన్ కల్యాణ్ ను కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకకు సంబంధించిన పలు విషయాలు మాట్లాడుకున్నామని అన్నారు. ఆడియో విడుదల రోజు ఒలింపిక్స్ లో పతకం సాధించి, దేశానికి గర్వకారణంగా నిలిచిన పీవీ సింధును ఆహ్వానించి, సన్మానిస్తామని తెలిపారు. సింధుకు 10 లక్షల రూపాయల చెక్ ను అందజేస్తానని ఆయన చెప్పారు. సింధు విజయం ప్రతి భారతీయుడికి గర్వకారణమని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News