: దుర్గాఘాట్‌లో స్నానమాచరించిన సంపూర్ణేష్ బాబు.. సెల్ఫీలు తీసుకున్న అభిమానులు
కృష్ణా పుష్కరాలకు చేసిన ఏర్పాట్లన్నీ బాగున్నాయని తెలుగు సినీనటుడు సంపూర్ణేష్ బాబు కితాబిచ్చాడు. విజయవాడలోని దుర్గాఘాట్‌లో ఆయన ఈరోజు పుణ్యస్నానమాచరించాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... పుణ్యస్నానమాచరించడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించాడు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు ఒలింపిక్స్ లో పతకం సాధించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశాడు. త్వరలో 'కొబ్బరిమట్ట' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పుష్కరాలకు వచ్చిన పలువురు యాత్రికులు పోటీపడ్డారు.