: ఆసుపత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జీ!


కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నిన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. కొన్నిరోజుల క్రితం వారణాసి పర్యటన సందర్భంగా జ్వరం, డీహైడ్రేషన్, భుజం నొప్పితో బాధపడిన సోనియా తన పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకుని ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. దాదాపు 11 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఆమె ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. తాజాగా మొన్న మరోమారు అనారోగ్యానికి గురైన ఆమె తిరిగి ఆసుపత్రిలో చేరారు. అయితే ఒక్కరోజులోనే ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగు కావడంతో నిన్న ఆమెను వైద్యులు డిశ్చార్జీ చేశారు. అయితే కనీసం మూడు వారాల పాటు ఆమెకు పూర్తి స్థాయి విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News