: గొందిమళ్లలో గవర్నర్!... తెలంగాణలో పుష్కర స్నానం చేయనున్న నరసింహన్!


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు కొద్దిసేపటి క్రితం పాలమూరు జిల్లాలోని గొందిమళ్ల పుష్కర ఘాట్ కు చేరుకున్నారు. కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఇప్పటికే ఏపీ పరిధిలోని విజయవాడ పున్నమి ఘాట్ లో పుష్కర స్నానం చేసిన గవర్నర్... తాజాగా తెలంగాణ పరిధిలో పుష్కర స్నానానికే గొందిమళ్ల పుష్కర ఘాట్ కు చేరుకున్నారు. నేటి ఉదయం తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రత్యేక హెలికాప్టర్ లో గవర్నర్ దంపతులను వెంట ఉండి గొందిమళ్ల తీసుకెళ్లారు. మరికాసేపట్లో గవర్నర్ దంపతులు పుష్కర స్నానం చేయనున్నారు.

  • Loading...

More Telugu News