: బెజవాడ మెట్రోలో కీలక అడుగు!... భూసేకరణకు రూ.300 కోట్ల కేటాయింపు!
నవ్యాంధ్రప్రదేశ్ పొలిటికల్ కేపిటల్ విజయవాడలో కొత్తగా ఏర్పాటు కానున్న మెట్రో రైలుకు ఎట్టకేలకు తొలి అడుగు పడింది. ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక పూర్తి కాగా, దీనికి కేంద్రం ఆమోదం తెలిపింది. అంతేకాకుండా మొన్నటి బడ్జెట్ లో కేంద్రం కొంత మేర నిధులను కూడా కేటాయించింది. తాజాగా ఈ ప్రాజెక్టులో కీలక అంశంగా పరిగణిస్తున్న భూసేకరణకు చంద్రబాబు సర్కారు శ్రీకారం చుట్టింది. మెట్రో రైలు ప్రాజెక్టుకు అవసరమయ్యే భూముల కోసం తొలి విడతగా రూ.300 కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో త్వరలోనే మెట్రో ప్రాజెక్టు భూసేకరణ ప్రారంభం కానుంది.