: రాజీవ్ గాంధీ 73వ జయంతి నేడు!... 'వీర్ భూమి'కి క్యూ కట్టిన ప్రముఖులు!
భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 73వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు నివాళి అర్పించేందుకు ఢిల్లీలోని వీర్ భూమికి ప్రముఖులంతా క్యూ కట్టారు. రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ సహా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తదితరులు వీర్ భూమి చేరుకుని రాజీవ్ కు నివాళి అర్పించారు. ఇక వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కూడా ఆయనకు నివాళి అర్పించేందుకు మరికాసేపట్లో వీర్ భూమికి వెళ్లనున్నారు.