: వాచ్ మెన్లను కొట్టిన కేంద్ర మంత్రి భద్రతాధికారిపై సస్పెన్షన్ వేటు
ఢిల్లీ ఘజియాబాద్ లోని ఆషియానా గ్రీన్స్ అనే సొసైటీకి చెందిన ఇద్దరు వాచ్ మెన్లను కొట్టిన తన భద్రతాధికారిని సస్పెండ్ చేసినట్లు కేంద్ర మంత్రి మహేష్ శర్మ తెలిపారు. రాఖీ పండగ రోజున తన సోదరి నివాసానికి వెళ్లిన సందర్భంలో ఈ సంఘటన జరిగిందన్నారు. దీనిపై ఆయన క్షమాపణలు చెప్పారు. తప్పు ఎవరిదో తెలుసుకున్న వెంటనే తన భద్రతాధికారిని సస్పెండ్ చేశానని, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు చెప్పానని అన్నారు. అయితే, వాచ్ మెన్లకు, తన సెక్యూరిటీ సిబ్బందికి మధ్య గొడవకు కారణమేమిటనేది పోలీసుల దర్యాప్తులో తేలుతుందన్నారు. కాగా, వాచ్ మెన్లపై సదరు భద్రతాధికారి దాడి చేసిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.