: 52 ర్యాలీలు...సుదీర్ఘంగా సాగుతున్న పాయింట్ల వేట...తొలి సెట్ లో సింధూ గెలుపు!


రియో ఒలింపిక్స్ లో మహిళల బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరుగుతోంది. పాయింట్ పాయింట్ కు ఉత్కంఠ పెరుగుతోంది. స్పెయిన్, భారత్ ఫ్యాన్స్ కేరింతల మధ్య సింధు, కరొలినా మారిన్ హోరాహోరీ తలపడ్డారు. తొలుత సింధు పాయింట్ల వేటలో తడబడింది. దీంతో ఆట తొలి అర్ధ భాగం మారిన్ ఆధిక్యంలోనే కొనసాగింది. రెండో అర్ధ భాగంలో సింధు తానేంటో రుచిచూపించింది. 12వ పాయింట్ సాధించే క్రమంలో సింధు, మారిన్ మధ్య 52 సుదీర్ఘ ర్యాలీలు నడిచాయంటే ఆట ఎంత హోరాహోరీగా సాగిందో గుర్తించవచ్చు. ఆ తరువాత మారిన్ మళ్లీ పుంజుకుంది. ఈ క్రమంలో సింధు మళ్లీ జూలువిదిల్చింది. అలా మారిన్ ను అధిగమించి సెట్ ను కైవసం చేసుకుంది.

  • Loading...

More Telugu News