: సింధుకు హైదరాబాదులో ఘన స్వాగతం లభిస్తుంది...సర్వం సిద్ధం: కేటీఆర్


రియో ఒలింపిక్స్ లో పతకాన్ని సాధించి, భారతదేశ కీర్తి ప్రతిష్ఠలు పెంచిన పీవీ సింధుకు హైదరాబాదులో ఘన స్వాగతం పలుకుతామని తెలంగాణ పంచాయతీరాజ్, పట్టణ, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పీవీ సింధు పతకం సాధించడం ద్వారా దేశానికి, రాష్ట్రానికి కూడా కీర్తిప్రతిష్ఠలు తీసుకొచ్చిందని అన్నారు. తమ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించడంలో ముందుంటుందని ఆయన తెలిపారు. సింధుకు ఘన స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు. హైదరాబాదు జంట నగరాలు సింధును సాదరంగా ఆహ్వానించేలా ఏర్పాట్లు ఉంటాయని ఆయన తెలిపారు. నేడు జరగనున్న ఫైనల్లో స్వర్ణం సాధిస్తుందన్న విశ్వాసం తనకు ఉందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News