: తారక్ అంటే అంత ఇష్టం నాకు: హీరో మంచు మనోజ్
సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ లు మంచిమిత్రులు. వారి స్నేహం ఎంతో కాలంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, సామాజికమాధ్యమాల ద్వారా తన అభిమానులకు దగ్గరగా ఉండే మనోజ్ ను ఒక అభిమాని తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రశ్నించాడు. ఇంతకీ ఆ ప్రశ్నదేని గురించంటే... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి. ‘అన్నా! నీకు తారక్ అంటే ఎంత ఇష్టం?’ అని మంచు మనోజ్ ను ఆ అభిమాని ప్రశ్నించాడు. దీనికి మనోజ్ స్పందిస్తూ, ‘నా ప్రాణం లెక్కచేయనంత’ అని సమాధానమిచ్చాడు. దీంతో, యంగ్ టైగర్ అభిమానులు తెగ మురిసిపోతున్నారు.