: రణవీర్, రణబీర్ లతో లిఫ్ట్ లో ఇరుక్కుపోతే డాన్స్ చేస్తా: దీపికా పదుకునే
సెలబ్రిటీలు ఏం మాట్లాడినా ఆసక్తికరమే. అందులోనూ సినీ నటులు మాట్లాడితే మరింత ఆసక్తిగా వుంటుంది. అందుకే, జర్నలిస్టులు వారి నుంచి తమాషా సమాధానాలు రాబడుతుంటారు. తాజాగా ఫిల్మ్ ఫేర్ అవార్డు ఫంక్షన్లో పాల్గొన్న దీపికా పదుకునే అలాంటి తమాషా ప్రశ్నలకు సమాధానం చెప్పింది. లెజెండరీ నిర్మాత యశ్ చోప్రాతో కలసి పనిచేయాలన్న తన కల నెరవేరలేదని తెలిపింది. యశ్ చోప్రాకి కూడా తానంటే చాలా అభిమానమని దీపిక తెలిపింది. అందుకే ఆయన సినిమాలో ఎప్పటికైనా నటించాలని కోరుకున్నానని చెప్పింది. ఇక రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ లతో కలిసి ఒకే లిఫ్ట్ లో ఇరుక్కుపోతే ఏం చేస్తారు? అని అడిగిన ప్రశ్నకి ‘‘వారిద్దరూ మంచి డ్యాన్సర్లు. కనుక వారితో కలిసి డ్యాన్స్ చేస్తాను’’ అని చెప్పింది. మీ ముగ్గురితో పాటు ఆ లిఫ్ట్ లో కత్రినా కైఫ్, అనుష్క శర్మ ఉంటే ఏం చేస్తారని అడిగితే, ఐదుగురం కలిసి బొమ్మరిల్లు ఆట ఆడుకుంటామని చెప్పింది. ఆటలో మంచి వంటకాలు వండి వడ్డిస్తామని చెప్పింది.