: ప్రతిపక్షనేత స్టాలిన్ ఆధ్వర్యంలో తమిళనాడు అసెంబ్లీ ముందు డీఎంకే ఎమ్మెల్యేల బైఠాయింపు
తమిళనాడు అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితపై తీవ్ర విమర్శలు చేసి గందరగోళం సృష్టించిన డీఎంకే ఎమ్మెల్యేలను స్పీకర్ ధనపాల్ ఏడు రోజుల పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయట రెండో రోజు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ప్రతిపక్షనేత స్టాలిన్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముందు ఎమ్మెల్యేలు బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. మరోవైపు కోయంబత్తూర్‌లోని పలు ప్రాంతాల్లో డీఎంకే కార్యకర్తలు ఆందోళనలకు దిగారు.