: సింధు టైటిల్ వేట వీక్షణకు తెలుగు నేలలో భారీ ఏర్పాట్లు!


రియో ఒలింపిక్స్ లో భారత్ కు పసిడి పతకం సాధిస్తుందని భావిస్తున్న బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు టైటిల్ పోరు వీక్షణ కోసం తెలుగు నేలలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో ఈ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. రద్దీ ప్రదేశాల్లో బిగ్ స్క్రీన్ల ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అదే విధంగా ఏపీలోని విజయవాడ, విశాఖ తదితర నగరాల్లోనూ బిగ్ స్క్రీన్ల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఇక సింధు గురువు పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్ పై తమ కూరుతు టైటిల్ వేటను సింధు కుటుంబ సభ్యులు వీక్షించనున్నారు.

  • Loading...

More Telugu News