: పుష్కరాల్లో మహిళా దొంగల హల్ చల్!... 111 మంది కి'లేడీ'ల అరెస్ట్!
కృష్ణా పుష్కరాల్లో దొంగలు హల్ చల్ చేస్తున్నారు. నిన్నటి దాకా మగ దొంగలు చేతివాటం ప్రదర్శిస్తే... తాజాగా లేడీ కిలాడీలు కూడా రంగప్రవేశం చేశారు. భక్తుల ముసుగులో పుష్కర భక్తుల గుంపుల్లో దూరిపోయిన మహిళా దొంగలు భక్తుల మెడల్లోని గొలుసులను లాగేస్తున్నారట. ఈ మేరకు తమ గొలుసులు మాయమైన మహిళా భక్తుల నుంచి ఫిర్యాదులు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశాల నుంచి వచ్చిన కిలాడీ లేడీలే ఈ చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు ఓ ప్రాథమిక అంచనాకు వచ్చారు. సదరు లేడీ కిలాడీల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మొత్తం 111 మంది కిలాడీ లేడీలను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి భారీగా బంగారం గొలుసులు, నగదును స్వాధీనం చేసుకున్నారు.