: సింధు షాట్లకు బెంబేలెత్తిపోయిన మారిన్!... వైరల్ గా నిరుటి డెన్మార్క్ ఓపెన్ మ్యాచ్ హైలైట్స్ వీడియో!


రియో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో తెలుగు తేజం పీవీ సింధు ఫైనల్ చేరింది. నేటి రాత్రి 7.30 గంటలకు జరగనున్న టైటిల్ పోరులో స్పెయిన్ కు చెందిన కరోలినా మారిన్ తో తలపడనుంది. వరల్డ్ నెంబర్: 1 ర్యాంకర్ గా ఉన్న మారిన్ పై పోరులో విజయం అంత ఈజీ ఏమీ కాదన్న వాదన వినిపిస్తున్నా... గతేడాది డెన్మార్క్ ఓపెన్ లో వీరిద్దరి మధ్య జరిగిన మ్యాచ్ చూస్తే మాత్రం విజయం సింధుదే అని చెప్పక తప్పదు. ఫైనల్ పోరు నేపథ్యంలో గతేడాది జరిగిన సదరు మ్యాచ్ కు సంబంధించిన హైలైట్స్ వీడియో జాతీయ మీడియాలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారిపోయింది. సదరు మ్యాచ్ లో మారిన్ ను ఓ ఆటాడుకున్న సింధు విజయం సాధించింది. సింధు కొట్టిన షాట్లకు మారిన్ బెంబేలెత్తిపోయిన తీరు ఆసక్తికరంగా ఉంది. ఏ కోశానా సింధుకు తగ్గ రీతిలో మారిన్ ఆడలేకపోయింది. షాట్లతో సింధు చెలరేగితే... వాటిని ఎదుర్కునే విషయంలో మారిన్ పూర్తిగా విఫలమైంది.

  • Loading...

More Telugu News