: వచ్చే ఒలింపిక్స్ లో నా కూతురు గోల్డ్ మెడల్ సాధిస్తుంది: సాక్షి మాలిక్ తల్లిదండ్రులు


2020లో జరిగే ఒలింపిక్స్ లో తన కూతురు కచ్చితంగా బంగారు పతకం తీసుకొస్తుందని మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ తల్లిదండ్రులు సుదేశ్, సుబీర్ మాలిక్ లు పేర్కొన్నారు. రియో ఒలింపిక్స్ లో భారత్ కు పతకం సాధించిన సాక్షి తల్లిదండ్రులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం తమ కూతురుకి 23 సంవత్సరాలని, వచ్చే ఒలింపిక్స్ కోసం పూర్తి స్థాయిలో ప్రాక్టీసు చేసి బంగారు పతకం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రియో ఒలింపిక్స్ లో సాక్షి మాలిక్ విజయ ఢంకా మోగించడంతో దేశం నలుమూలల నుంచీ విలేకరులు హర్యానాలోని ఆమె నివాసానికి క్యూ కడుతుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News