: ఈ గెలుపు నేను ఊహించినదే... ఈ ఆనందాన్ని వర్ణించలేను: సింధు తండ్రి


దేశం మొత్తం గర్వించే విధంగా తన కుమార్తె రియో ఒలింపిక్స్ పతకం తెస్తుందని పీవీ సింధు తండ్రి రమణ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సింధు సాధిస్తుందని తాను ముందే ఊహించానని అన్నారు. ఈ రోజు తన ఆనందాన్ని వర్ణించేందుకు మాటలు చాలడం లేదని ఆయన పుత్రికోత్సాహం ప్రదర్శించారు. ఈ విజయానికి కారణం గోపీచంద్ అకాడమీ అని ఆయన చెప్పారు. సింధు విజయం వెనుక గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఆటగాళ్ల సహాయం ఎంతో ఉందని ఆయన అన్నారు. ప్రధానంగా గోపీచంద్ కుమారుడు విష్ణు నిరంతరం సింధుతో ప్రాక్టీస్ చేసేవాడని ఆయన చెప్పారు. దేశానికి పతకం తేవడం ఆనందంగా ఉందని వారు హర్షం వ్యక్తం చేశారు. సింధు విజయం సాధించాలని ప్రతి రోజూ గుడికి వెళ్లేదానినని ఆమె తల్లి లక్ష్మి తెలిపారు.

  • Loading...

More Telugu News