: టీవీలకు అతుక్కుపోయిన కోట్లాది భారతీయులు... ఆధిక్యంలో సింధు


కోట్లాది మంది భారతీయులు టీవీ సెట్ లకు అతుక్కుపోయారు. భారతదేశం నుంచి ఎన్నో అంచనాలతో రియో ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు వెళ్లిన ఆటగాళ్లు రిక్తహస్తాలతో వెనుదిరుగుతున్న వేళ...ఎలాంటి అంచనాలు లేని సాక్షి మాలిక్ కాంస్య పతకం తెచ్చి బోణీ చేయగా, మరో పతకంపై ఆశలు రేపుతున్న తెలుగు తేజం సింధు పాల్గొంటున్న బ్యాడ్మింటన్ సెమీ పైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన టీవీ ఛానెల్స్ అన్నీ సింధు మ్యాచ్ ను లైవ్ టెలికాస్ట్ చేయగా, ఇతర జాతీయ ఛానెళ్లు సింధు ఆటతీరుపై కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కు చెందిన సింధు జపాన్ కు చెందిన ఒకుహరా హోరాహోరీ ఆటతీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. తొలి సెట్ ఆరంభం నుంచి సింధు దూకుడు ప్రదర్శించింది. సింధును జపాన్ క్రీడాకారిణి అద్భుతంగా అడ్డుకుంటోంది. డ్రాప్, కట్స్, షాట్లతో ఇద్దరూ ఆకట్టుకుంటున్నారు.

  • Loading...

More Telugu News