: ఏపీలో త్వరలో హెల్త్ ఏటీఎంలు ప్రారంభిస్తాం: మంత్రి కామినేని


ఏపీలో త్వరలోనే హెల్త్ ఏటీఎంలు ప్రారంభిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయవాడలోని పవిత్ర సంగమం ఘాట్ ఫెర్రీ వద్ద ‘మన ఆరోగ్యం- మన చేతిలో’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 500 మంది వైద్యుల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని, రాష్ట్రంలో '104' వాహనాలను పెంచి మాతా శిశు మరణాలు తగ్గించగలిగామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని, అన్ని జిల్లాల్లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, అర్బన్ హెల్త్ సెంటర్ల స్థాయిని పెంచుతామని తెలిపారు.

  • Loading...

More Telugu News