: శవాలపై పడి ఏడ్చినట్లు కాంగ్రెస్ పై పడి బీజేపీ ఏడుస్తోంది: కేవీపీ రామచంద్రరావు


ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో పెట్టలేదంటూ కాంగ్రెస్ పై నింద మోపాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ, శవాలపై పడి ఏడ్చినట్లుగా తమ పార్టీపై పడి ఏడుస్తోందని సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు మండిపడ్డారు. ఈరోజు విశాఖపట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా విషయమై ఏపీ ప్రజలను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా అంశాన్ని తమ మేనిఫెస్టోలో చేర్చిన బీజేపీని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు నిలదీయడం లేదని కేవీపీ ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలని కేవీపీ రామచంద్రరావు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News