: న‌ల్గొండ జిల్లాలోని అడ‌విదేవులప‌ల్లిలో పుష్కరస్నానమాచరించిన మాజీ క్రికెట‌ర్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్


తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్క‌రాలు వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. పుష్క‌ర యాత్రికుల‌తో అన్ని ఘాట్లు రద్దీగా మారాయి. న‌ల్గొండ జిల్లాలోని అడ‌విదేవులప‌ల్లిలో ఏర్పాటు చేసిన పుష్క‌రఘాట్‌లో ఈరోజు టీమిండియా మాజీ క్రికెట‌ర్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ పుష్క‌ర‌స్నానమాచ‌రించారు. కుటుంబ‌ స‌భ్యులతో క‌లిసి హైద‌రాబాద్ నుంచి అడ‌విదేవులప‌ల్లికి వ‌చ్చిన ఆయ‌న.. కుటుంబ స‌మేతంగా పుష్క‌రస్నానం చేశారు. అనంత‌రం అక్క‌డి సూర్య దేవాల‌యంలో ల‌క్ష్మ‌ణ్ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

  • Loading...

More Telugu News