: చివరి టెస్టు నేటి నుంచే!... 3-0 విజయంపై కోహ్లీ సేన గురి!


కరీబియన్ గడ్డపై అడుగుపెట్టిన కోహ్లీ సేన ఇప్పటికే టెస్టు సిరీస్ ను కైవసం చేసుకోగా... సదరు విజయాన్ని మరింత మెరుగు పరచుకునేందుకు పక్కా వ్యూహాలు రచించుకుంది. నాలుగు టెస్టుల సిరీస్ లో ఇప్పటికే మూడు టెస్టులు ముగియగా... తొలి టెస్టులో టీమిండియా నెగ్గింది. రెండో టెస్టును వరుణుడు అడ్డుకోవడంతో డ్రా అయింది. మళ్లీ మూడో టెస్టులో టీమిండియా గెలవడంతో... సిరీస్ కోహ్లీ సేన వశమైంది. ఇక టెస్టు సిరీస్ లో చివరి టెస్టు మ్యాచ్ భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి మొదలుకానుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జరిగే ఈ మ్యాచ్ కు సంబంధించి ఇప్పటికే కసరత్తులు పూర్తి చేసిన టీమిండియా చివరి టెస్టులోనూ విజయబావుటా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతోంది. వెరసి కరీబియన్ గడ్డపై టెస్టు సిరీస్ ను 3-0తో కైవసం చేసుకోవాలని కోహ్లీ సేన భావిస్తోంది. మరోవైపు ఇప్పటికే టెస్టు సిరీస్ చేేజార్చుకున్న వెస్టిండిస్ జట్టు చివరి మ్యాచ్ లోనైనా పుంజుకోవాలని యత్నిస్తోంది.

  • Loading...

More Telugu News