: సోమశిల పుష్కరఘాట్ వద్ద కుటుంబ సమేతంగా బాలకృష్ణ పుష్కర స్నానం
తెలంగాణలో కృష్ణా పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రాఖీ పౌర్ణమి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లాలోని సోమశిల పుష్కరఘాట్ వద్దకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. హైదరాబాద్ నుంచి సోమశిల పుష్కరఘాట్ వద్దకు చేరుకున్న ప్రముఖ సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు ఉదయం పుష్కర స్నానమాచరించారు. కుటుంబ సమేతంగా ఆయన పుష్కరస్నానం చేశారు. మరి కొద్దిసేపట్లో ఆయన తిరిగి హైదరాబాద్కు బయలుదేరనున్నట్లు తెలుస్తోంది.