: రంగంలోకి బుర్హాన్ వనీ వారసుడు!... కశ్మీర్ కు స్వాతంత్ర్యం వచ్చేదాకా పోరాటమేనని ప్రకటన!
జమ్ము కశ్మీర్ కు స్వాతంత్ర్యం పేరిట ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ భారత సైన్యం చేతిలో హతమైన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ వారసుడు రంగంలోకి దిగాడు. వాట్సప్ వీడియోలో ప్రత్యక్షమైన జకీర్ రషీద్ భట్ అనే యువకుడు తనను తాను బుర్హాన్ వనీ వారసుడిగా ప్రకటించుకున్నాడు. అంతేకాకుండా కశ్మీర్ కు స్వాతంత్ర్యం వచ్చేదాకా పోరు సాగిస్తానని శపథం చేశాడు. తన పోరాటానికి కశ్మీర్ ప్రజలు బాసటగా నిలవాలని అతడు పిలుపునిచ్చిన సదరు వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది.