: సాక్షి మాలిక్ కు బంపర్ బొనాంజా!... రూ.2.5 కోట్ల నగదు, ఉద్యోగాన్ని ప్రకటించిన హర్యానా సర్కారు!
రియో ఒలింపిక్స్ లో భారత పతకాల ఖాతా తెరచిన మహిళా మల్ల యోధురాలు సాక్షి మాలిక్ కు ప్రశంసలతో పాటు భారీ ఆపర్లు కూడా వచ్చి పడుతున్నాయి. నిన్నటిదాకా మాలిక్ వైపు కన్నెత్తి చూడని ఆమె సొంత రాష్ట్రం హర్యానా ... తాజాగా ఆమె రియోలో కాంస్య పతకం సాధించగానే మేల్కొంది. భారత తరఫున తొలి పతకం సాధించిన మాలిక్ కు రూ.2.5 కోట్ల నగదు పురస్కారాన్ని ప్రకటించిన మనోహర్ లాల్ ఖట్టర్ సర్కారు... ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఇవ్వనున్నట్లు నేటి ఉదయం కీలక ప్రకటన చేసింది.