: నేను నిలవాలంటే... మీరు గెలవాల్సిందే!: పార్టీ నేతలతో వైఎస్ జగన్
వైసీపీ కో-ఆర్డినేటర్ల భేటీలో భాగంగా నిన్న ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలను పార్టీకి జీవన్మరణ సమస్యగా అభివర్ణించిన ఆయన... సదరు ఎన్నికల్లో తప్పనిసరిగా గెలిచి తీరాల్సిందేనని చెప్పుకొచ్చారు. సమావేశానికి హాజరైన నేతలను ఉద్దేశించి ఆయన కాస్తంత ఉద్వేగంగానే మాట్లాడారు. మిమ్మల్ని అందరినీ గెలిపించాలన్నదే తన తాపత్రయమన్న ఆయన... మీరంతా గెలిస్తేనే తాను నిలబడతానంటూ పేర్కొన్నారు. ‘‘వచ్చే ఎన్నికలు మనకు జీవన్మరణ సమస్య. మీరు గెలిస్తేనే నేనుంటా. మిమ్మల్నందరినీ గెలిపించాలన్నదే నా తాపత్రయం. రెండోసారి ఓడిపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. అందువల్లే ప్రజలతో ఉండండి. ప్రజలు మనలను విశ్వసిస్తున్నారు. ఆ విశ్వాసాన్ని పెంచుకోవాలి. అధికారంలోకి వస్తే ప్రతి మాటనూ నిలబెట్టుకుంటా. మీ నియోజకవర్గాల్లో మీరిచ్చే హామీల అమలుకూ సహకరిస్తా’’ అని ఆయన పార్టీ నేతలతో అన్నారు.