: శ్రావణ పౌర్ణమి ఎఫెక్ట్!.. పుష్కర ఘాట్లకు పోటెత్తిన భక్తజనం!
తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న కృష్ణా పుష్కరాలు నేటితో ఏడో రోజుకు చేరుకున్నాయి. నేడు శ్రావణ పౌర్ణమి కావడంతో రెండు రాష్ట్రాల్లోని పుష్కర ఘాట్లకు భక్తులు పోటెత్తారు. నేటి తెల్లవారుజాము నుంచే రెండు రాష్ట్రాల్లోని పుష్కర ఘాట్లన్నీ భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే పుష్కర స్నానం చేసిన పలువురు ప్రముఖులు కూడా నేడు శ్రావణ పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకుని నేడు మరోమారు పుష్కర స్నానం ఆచరిస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని దంపతులు కొద్దిసేపటి క్రితం పవిత్ర సంగమం వద్ద పుష్కర స్నానం చేశారు.