: పుష్కర స్నానానికి వైఎస్ జగన్!... నేడు పున్నమి ఘాట్ కు వెళ్లనున్న వైసీపీ అధినేత!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కృష్ణా పుష్కరాలకు వెళుతున్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్ లో ఆయన పుష్కర స్నానం ఆచరించనున్నారు. నేటి ఉదయం హైదరాబాదులో బయలుదేరి విజయవాడకు చేరుకునే జగన్... నగరంలోని పున్నమి ఘాట్ కు వెళతారు. పుష్కరాలకు హాజరుకావాలని ఏపీ సర్కారు జగన్ కు ఇటీవలే ఆహ్వానం పలికింది. పుష్కరాల ప్రారంభ సమయంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ ఆ తర్వాత తిరిగి హైదరాబాదుకు వచ్చిన సంగతి తెలిసిందే. నేడు పుష్కర స్నానం చేసిన అనంతరం... మొన్న పుష్కరాల కోసం వచ్చి నీట మునిగిన విద్యార్థుల కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ కృష్ణా జిల్లా నందిగామకు వెళతారు.