: గోడ దూకేసిన టీడీపీ నేత!... వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే!
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కొట్టు సత్యనారాయణ గోడ దూకేశారు. మొన్న రాత్రి తాడేపల్లిగూడెం నుంచి భారీ అనుచరగణంతో హైదరాబాదు బయలుదేరిన సత్యనారాయణ... నిన్న మధ్యాహ్నం లోటస్ పాండ్ లోని వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ జగన్ స్వయంగా కండువా కప్పి సత్యనారాయణను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆ తర్వాత జరిగిన పార్టీ కో-ఆర్డినేటర్ల సమావేశానికి సత్యనారాయణను ఆహ్వానించిన జగన్... ఆయనను పార్టీ నేతలకు పరిచయం చేశారు.