: ఓటమెరుగని ప్రత్యర్థికి ఇవే చివరి ఒలింపిక్స్... శ్రీకాంత్ కు ఇవే తొలి ఒలింపిక్స్
భారత్ కు ఒలింపిక్స్ లో పతకం సంపాదించడం ద్వారా ఒలింపిక్స్ లో దేశ ప్రాతినిధ్యాన్ని నిలబెట్టే సదవకాశం ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆటగాళ్ల చేతుల్లో ఉంది. ఈ దశలో కిదాంబి శ్రీకాంత్ పతకం సాధిస్తాడని ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు. కోర్టులో వేగంగా కదిలి, కచ్చితమైన షాట్లు కొట్టే శ్రీకాంత్ ఆటతీరుపై ఆశలు ఉండడం సరైనదే. అయితే, అదే సమయంలో అతని ప్రత్యర్థి బలాబలాలను ఓసారి సరిచూస్తే... శ్రీకాంత్ కు క్వార్టర్ ఫైనల్స్ లో చైనాకు చెందిన లిన్ డాన్ తో నేడు మ్యాచ్ జరగనుంది. చైనా టాప్ ప్లేయర్ అయిన లిన్ డాన్ కు ఇప్పటి వరకు ఒలింపిక్స్ లో ఓడిన చరిత్ర లేదు. 32 ఏళ్ల లిన్ డాన్ కు ఇవే చివరి ఒలింపిక్స్ కాగా, 23 ఏళ్ల శ్రీకాంత్ కు ఇవే తొలి ఒలింపిక్స్. లిన్ డాన్ చేతిలో శ్రీకాంత్ ఇప్పటికి రెండు సార్లు ఓటమిపాలు కాగా, ఒలింపిక్స్ లో, సొంత గడ్డపై ఓటమి ఎరుగని లిన్ డాన్ ను చైనాలో శ్రీకాంత్ ఓడించాడు. ఇదే విశ్వాసంతో బరిలో దిగుతున్నానని తెలిపాడు. కాగా, నేటి రాత్రి వీరిద్దరి మధ్య మ్యాచ్ జరగనుంది.