: తెలుగు గంగకు గండి!... మహానంది క్షేత్రం వద్ద వృథాగా పోతున్న నీరు!
ఏపీలో ప్రధాన కాల్వలకు వరుసగా గండ్లు పడుతున్నాయి. మొన్నటికి మొన్న పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదిలో కలిపేందుకు ఏర్పాటు చేసిన పోలవరం కుడికాలువకు గండి పడిన విషయం తెలిసిందే. దీనిపై వేగంగా స్పందించిన అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి గండిని పూడ్చివేసింది. తాజాగా రాయలసీమకు సాగు, చెన్నైకి తాగు నీటిని అందిస్తున్న తెలుగు గంగ కాల్వకు కూడా గండి పడింది. కర్నూలు జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం మహానంది సమీపంలో 9వ బ్లాక్ దగ్గర పడిన ఈ గండి కారణంగా పెద్ద ఎత్తున నీరు వృథాగా పోతోంది. సమాచారం అందుకున్న జలవనరుల శాఖ అధికారులు అక్కడికి చేరుకుని గండి మరమ్మతు పనులపై సమీక్ష చేస్తున్నారు.