: నివేదిక వచ్చేసింది... రవిశంకర్ 'వరల్డ్ కల్చర్ ఫెస్టివల్'తో యమునా నదీ పరీవాహక ప్రాంతం పూర్తిగా ద్వంసమైందట!
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' రవిశంకర్ యమునా నదీ పరీవాహక ప్రాంతంలో ఘనంగా నిర్వహించిన వరల్డ్ కల్చర్ ఫెస్టివల్ సందర్భంగా అక్కడ ఏర్పడిన కాలుష్యం, పర్యావరణ నష్టాలను సుదీర్ఘంగా పరిశీలించిన నిపుణుల కమిటీ తాజాగా తమ నివేదికను నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌కు సమర్పించింది. యమునా నది తీరంలో పర్యావరణాన్ని నాశనం చేశారని రవిశంకర్‌పై వచ్చిన ఆరోపణలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ జస్టిస్ స్వతంత్ర కుమార్ ఆధ్వర్యంలో ఓ కమిటీని వేసిన సంగతి తెలిసిందే. యమునా నదీ పరీవాహక ప్రాంతం పూర్తిగా ద్వంసమైందని కమిటీ నివేదికలో పేర్కొంది. అక్కడి పర్యావరణానికి ఎంతో నష్టం కలిగిందని తెలిపింది. దీనికి సంబంధించిన 47 పేజీల నివేదికను కమిటీ సమర్పించింది. దీంతో రవిశంకర్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు.