: పుష్కరాల్లో 'అధిక' వసూళ్లపై కఠినంగా వ్యవహరించాలి: అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం
ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా పుష్కారాలు ఆరోరోజు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పుష్కరాలపై సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. కృష్ణా పుష్కరాల్లో అర్ధభాగం విజయవంతంగా పూర్తి చేశామని ఆయన అన్నారు. పుష్కరాల్లో పురోహితులు భక్తుల నుంచి అధికంగా వసూలు చేసినా, వసతుల విషయంలో సిబ్బంది అధికంగా డబ్బులు వసూలు చేసినా వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. మరిన్ని ఉచిత బస్సులను భక్తులకు అందుబాటులోకి తేవాలని ఆయన ఆదేశించారు. పద్మావతి ఘాట్ వద్ద ఉదయం 5 నుంచి 11 గంటల వరకు భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. యాత్రికులను నియంత్రించే అంశాలపై ఆయన పలు సూచనలు చేశారు.